శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు
స్థలపురాణం

శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం

1954 సంవత్సరంలో కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలం, శింగరాయపాలెం మరియు చేవూరు పాలెం సెంటర్‌లో గుళ్ల శింగరాయపాలెంగా

ప్రసిద్ధి చెందిన శింగరాయపాలెం గ్రామములో ఒక దేవతా సర్పరాజము శ్రీ బావాజీ మఠములో నుండి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానము తటాకములోనికి ప్రతిరోజు

వచ్చి స్నానము గావించి తిరిగి వెళ్ళు సందర్భములో చేవూరుపాలెంకు చెందిన ఇద్దరు రైతు సోదరులు ఆ దేవతా సర్పరాజముపై రాళ్ళు విసరగా ఆ సర్పరాజము తల నేల

బాదుకొని మరణించెను. ఆ సర్పమును గ్రామస్థులు చేవూరుపాలెం కాలువగట్టుపై పాతిపెట్టగా ఆ రైతు సోదరులకు చూపు పోయినది. దర్మిలా వారి యొక్క అపరాధము మన్నించమని

శ్రీ స్వామివారిని మ్రొక్కిన తదుపరి ఆ రైతు సోదరులకు చూపు వచ్చినది. ఆ రోజు రాత్రి గ్రామపెద్దలకు శ్రీ స్వామి వారు కలలో కనిపించి ఆలయమును నిర్మించవలిసినదిగా ఆదేశించినందున

పాతిపెట్టబడిన సర్పమును వెలుపలికి తీసి ఊరేగించి, దహనసంస్కారములు చేయు ప్రదేశము కోసం పెద్దలు, పండితులు చేవూరుపాలెం, శింగరాయపాలెం సెంటర్‌లో సమావేశమై

చర్చించుచుండగా దారిన పోయే ఆవుల మందలో నుండి ఒక కపిలగోవు (నల్లని ఆవు) అంబా అని అరచుచూ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థాన

తటాకములో దిగి స్నానమాచరించి చెరువు గట్టుపైకి వచ్చి చుట్టూ ప్రదక్షిణము చేసి గోపంచకము, గోమయం విసర్జించి కాలిగిట్టలతో నేల

త్రవ్వుతూ అంబా అని అరచుచున్న సందర్భమున ఆ వింత చూస్తున్న పండితులు, గ్రామపెద్దలు ఆ ప్రదేశములోనే గుడి నిర్మాణము చేయుట

ఆ దైవము ఆదేశమని భావించి ఆ దివ్యమైన ప్రదేశములోనే శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్తానం ప్రతిష్ట గావించిరి.

అప్పటి నుండి భక్తుల సహకారముతో నిర్మాణము గావించబడినది. శ్రీ స్వామి వారిని నిర్మలమైన మనస్సుతో నమస్కరించి, ప్రార్ధించి స్వామి

వారిని దర్శించిన సకల దోషాలు పరిహరింపబడతాయని భక్తుల నమ్మకం. దీర్ఘకాల సమస్యలు, సంతానము, వివాహము, కుజదోషం,

ఐశ్వర్యము, ఆయురారోగ్యములు ఇలా ఏ కష్టములో నున్నవారు ఏదికోరి వచ్చినను, శ్రీ స్వామి వారికి మ్రొక్కుకుని అత్యంత భక్తి శ్రద్దలతో

పుట్టలో పాలు పోసుకుని, పంచామృతాలతో అభిషేకము, సర్పదోష నివారణ పూజ జరిపించుకున్న వారి బాధలు తొలగిపోగలవని భక్తుల ప్రగాఢ

విశ్వాసము.

ఆలయ దర్శన వేళలు
  • ప్రతి రోజు,
  • ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
  • సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
ఎలా చేరుకోవాలి

రవాణా సౌకర్యాలు

రోడ్డు మార్గాలు

  • విజయవాడ నుండి గుడివాడ వచ్చి, అక్కడి నుండి బంటుమిల్లి వచ్చే రోడ్డు శింగరాయపాలెం గుండా పోతుంది.
  • గుడివాడ నుండి బంటుమిల్లి వచ్చే రోడ్డు శింగరాయపాలెం గుండా పోతుంది
  • మచిలీపట్నం నుండి బంటుమిల్లి వచ్చి, అక్కడి నుండి గుడివాడ వచ్చే రోడ్డు శింగరాయపాలెం గుండా పోతుంది

రైలు మార్గం

  • సమీప రైల్వే స్టేషన్లు విజయవాడ, గుడివాడ

విమాన మార్గం

  • సమీప విమానాశ్రయాలు విజయవాడ, హైదరాబాద్